‘దిశ’ కథనాల ఎఫెక్ట్.. డిప్యూటేషన్ ఉపాధ్యాయులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

by Jakkula.Mamatha |

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, అచ్చంపేట మండలంలోని ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై మైదాన ప్రాంతాలకు వెళ్లిన ఉపాధ్యాయులు తమ అసలు పాఠశాలల్లో తిరిగి విధుల్లో చేరేలా జిల్లా విద్యాశాఖ చర్యలు వేగవంతం చేసింది.

‘దిశ’ కథనాల ఎఫెక్ట్.. డిప్యూటేషన్ ఉపాధ్యాయులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు
X

దిశ,అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, అచ్చంపేట మండలంలోని ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై మైదాన ప్రాంతాలకు వెళ్లిన ఉపాధ్యాయులు తమ అసలు పాఠశాలల్లో తిరిగి విధుల్లో చేరేలా జిల్లా విద్యాశాఖ చర్యలు వేగవంతం చేసింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి మండల విద్యాధికారులకు (ఎంఈఓలు) మధ్యాహ్నం ఒంటి గంటలోపు డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులు తమ ఒరిజినల్ స్థానాల్లో విధుల్లో చేరారా లేదా అనే వివరాలతో నివేదికను పంపాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత, విద్యార్థుల విద్యకు కలుగుతున్న ఇబ్బందులపై ‘దిశ’ వరుస కథనాలు ప్రచురించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, విద్యాశాఖ స్పందించి ఈ చర్యలు చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులు తిరిగి ఏజెన్సీ పాఠశాలల్లో విధుల్లో చేరేలా జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమని, ఇది మారుమూల ప్రాంత విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు "దిశ వరుస కథనాల నేపథ్యంలో" సాధ్యమైందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story