- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదేనా ప్రజా పాలన?.. మాజీ సర్పంచ్ భర్త మృతిపై జనాగ్రహం
మానకొండూరు నియోజకవర్గం ఎంఎల్ఏ కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత సహాయకుడి వేధింపులతో గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన మాజీ సర్పంచ్ భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి మృతి వివాదాస్పదంగా మారింది.

దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఎంఎల్ఏ కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత సహాయకుడి వేధింపులతో గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన మాజీ సర్పంచ్ భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి మృతి వివాదాస్పదంగా మారింది. కవ్వంపల్లి వ్యక్తిగత పిఏ మురళీధర్ రెడ్డి ఆగడాలు శృతిమించడంతో ఆ నియోజకవర్గం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తు నిత్యం మీడియాలో పతాక శీర్షికన వార్తలు రావడం అదికార పార్టీని కుదిపేస్తుండగ తాజాగా గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త అగ్నికి ఆహుతి అవ్వడం జనాగ్రహానికి కారణమయ్యింది.
కవ్వంపల్లి పిఏ మురళీధర్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి వేధించడంతో తన బాధ చెప్పుకునేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రాజేందర్ రెడ్డి మంటల్లో తగలబడటం పలు అనుమానాలు రేకెత్తించగా అగ్నికి ఆహుతై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజేందర్ రెడ్డికి అండగా నిలవాల్సిన అధికారులు మురళీధర్ రెడ్డికి కోమ్ము కాస్తు బాధితుడి పై కేసుల మీద కేసులు నమోదు చేయడం అధికార దురహంకారానికి నిదర్శనంగా నిలిచి ప్రజాగ్రహానికి కారణం కాగ బాదితుడికి అండగా నిలవాల్సిన ఎంఎల్ఏ కవ్వంపల్లి ఓ మిడియాలో మాట్లాడుతు బాధితుడిని కించపరిచే విధంగా చేసిన వాఖ్యలు నియోజకవర్గంలో ఎంఎల్ఏ కవ్వంపల్లిని మరింత ఇరకాటంలో పడేసి విషయాన్ని వివాదస్పదంగా మార్చేసాయి
పార్టీలో చేర్చుకుని ప్రాణాలు తీశారు..
బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఎన్నికలకు ముందు గ్రామంలోకి వచ్చిన కవ్వంపల్లి రాజేందర్ రెడ్డిని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేర్చుకున్నారు అప్పటి నుంచి కవ్వంపల్లి గెలుపుకోసం గ్రామంలో మండలంలో చురుకైన నాయకుడిగా పనిచేసి కవ్వంపల్లి గెలుపు లో ప్రధాన పాత్ర పోషించాడు అదికారం చేతికి వచ్చాక వ్యక్తిగత సహాయకుడిగా పెట్టుకున్న మురళీధర్ రెడ్డి ఆగడాలు కవ్వంపల్లి అక్రమ దందాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో పలు సందర్భాలు వేదికల్లో రాజేందర్ రెడ్డి ప్రశ్నించాడు దీంతో రాజేందర్ రెడ్డి పై కోపం పెంచుకుని వేధించడం మొదలు పెట్టారు.
ఆ క్రమంలో గుండ్లపల్లిలోని తన బ్రిక్స్ యూనిట్ లో మండలానికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించడం పై నిలదీసేందుకు తన మొబైల్ ఫోన్ పగలగొట్టి దాడి చేసినప్పటికి వారిపై కేసులు నమోదు చేసి హెచ్చరించాల్సిన అధికారులు రాజేందర్ రెడ్డిపై ఎస్సి ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో మురళీధర్ రెడ్డి తన పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నాడంటూ స్థానిక ఎంఎల్ఏ కవ్వంపల్లిని కలిసి బాధ చెప్పుకునేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రాజేందర్ రెడ్డి అగ్నికి ఆహుతి కావడం వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతిచెందడంతో పార్టీలో చేర్చుకున్నద ప్రాణాలు తీసేందుకేనా ?అనే విమర్శలు వ్యక్తం అవుతు జనం అదికార కాంగ్రెస్ పార్టి ఆగడాలపై దుమ్మెత్తి పోస్తున్నారు
ఇదేనా ప్రజాపాలన ?
గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త మృతి తో అధికార పార్టీ పై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎంఎల్ఏ తన వ్యక్తిగత సహాయకుడి అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేదించి ప్రాణాలు తీయడమే ప్రజా పాలనా?అంటు జనం ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ నేతలు ఘటన జరిగిన నాటి నుంచి కనీసం బాధితుడిని పరామర్శించిన పాపాన పోక పోగ బాధితుడి పై కేసుల మీద కేసులు నమోదు చేయడం వివాదస్పదంగా మారి నిరంకుశ పాలనకు నిదర్శనంగా మారింది అయితే మృత్యుదేవతగా పోరాడుతున్న బాధితుడి పై కవ్వంపల్లి చేసిన వాఖ్యలు నియోజకవర్గంలో దుమారం లేపి జనం దుమ్మెత్తి పోయడంతో కొంత వెనక్కి తగ్గినప్పటికీ తప్పును సవరించుకునేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయని ఎంఎల్ఏ అతని పీఏలు పరామర్శించడానికి వెల్లే వారిని వేదించడంతో ఇదేం నిరంకుశత్వం అంటు అధికార పార్టీ నేతల పై జనం దుమ్మెత్తి పోసారు దాదాపుగా పదిరోజుల పాటు మృత్యువుతో పోరాడి రాజేందర్ రెడ్డి మృతిచెందడంతో అధికార పార్టీ నేతలపై జనాగ్రహం ఒక్కసారిగా పెల్లుబికి గుండ్లపల్లి రణరంగంగా మారింది రాజీవ్ రహదారి దిగ్బందనం చేసిన గ్రామస్తులు బందువులు మరళీదర్ రెడ్డి ఇంటిపై దాడికి దిగారు శవాన్ని మరళీదర్ రెడ్డి ఇంటి ముందు పెట్టి నిరసన వ్యక్తం చేసారు ఆందోళనకు దిగిన జనాన్ని నిలువరించేందుకు పోలిసులు చేసిన ప్రయత్నాలు విపలం కావడంతో పోలీసులు నిరసనకారులపై లాఠీ చార్జ్ చేసి చెల్లా చెదురు చేసారు దీంతో పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తు జనం ఇదేనా ప్రజా పాలన అంటు శాపనార్థాలు పెట్టారు
శృతిమించిన మురళీధర్ రెడ్డి ఆగడాలు
మానకొండూర్ ఎంఎల్ఏ వ్యక్తిగత సహాయకుడు మరళీదర్ రెడ్డి ఆగడాలు ఎంఎల్ఏ కవ్వంపల్లినమ అదికార పార్టీని అప్రతిష్ట పాలు చేస్తుండగా అదికారులు సైతం వారికి వంతపాడుతు అక్రమాలకు అండగా నిలవడం పై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపు కార్యాలయం కేంద్రంగా అక్రమాలకు వ్యూహలు రచిస్తుండగా అదికారులు జీ హుజూర్ అంటు అమలు చేయడం వివాదస్పదంగా మారుతుంది. తాజాగా రాజేందర్ రెడ్డి మృతితో కవ్వంపల్లి తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోగా ఆగ్రహంతో రగిలిపోతుండగ అదికారపార్జికి చెందిన నాయకులు సైతం మురళీదర్ రెడ్డి ఆగడాలతో నలిగిపోవడం అతగాడి అరాచకాలకు నిదర్శనంగా నిలుస్తూ జనాగ్రహానికి కారణమవుతుంది
మురళీధర్ రెడ్డితో పాటు నలుగురిపై కేసు నమోదు..
మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి మృతితో మానకొండూర్ ఎంఎల్ఏ కవ్వంపల్లి సత్యనారాయణ పిఎ మురళీధర్ రెడ్డితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరిస్థితి ముందే పసిగట్టిన ఎంఎల్ఏ తన పిఏ మురళీధర్ రెడ్డిని అజ్ఞాతంలోకి పంపగా కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తారా లేక షరా మామూలే అన్నట్టు వ్యవహరిస్తు లైట్ తీసుకుంటార అనే చర్చ జిల్లాలో జరుగుతుండగా బాధితులకు పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు రాజేందర్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు.






