- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఫౌజీ' గ్లింప్స్ విడుదలపై క్రేజీ అప్‌డేట్
ఆగస్టు 15న 'ఫౌజీ' గ్లింప్స్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఫౌజీ' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో యంగ్ హీరోయిన్ ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ప్రభాస్ ఊరమాస్ లుక్‌లో కనిపించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రెండు పోస్టర్లు మినహా ఎలాంటి అప్‌డేట్స్‌ను మేకర్స్ విడుదల చేయలేదు.
దీంతో ఈ చిత్రం నుంచి గ్లింప్స్ లేదా టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఆగస్టు 15న 'ఫౌజీ' గ్లింప్స్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ గ్లింప్స్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






