బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి స్పాట్ డెడ్

by Jakkula.Mamatha |

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ బైపాస్ రోడ్డులో బిలీఫ్ ఆసుపత్రి సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి స్పాట్ డెడ్
X

దిశ, ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ బైపాస్ రోడ్డులో బిలీఫ్ ఆసుపత్రి సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అతను వాహనం కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నామవరం గ్రామానికి చెందిన గోపిగా గుర్తించారు. ఆయన స్థానికంగా ఓ షోరూమ్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. యూనికాన్ బైక్‌పై టర్నింగ్ దాటుతున్న సమయంలో నాయుడుపేట వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, లారీ డ్రైవర్ వివరాలు తదితర అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

Next Story