- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లాలపై సీఎం స్పెషల్ ఫోకస్.. కేబినెట్ భేటీలో కీలక ఆదేశాలు
ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఇవాళ అమరావతిలో ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో పాల్గొన్న మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) జిల్లాల(Districs)పై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఇవాళ అమరావతి(Amaravati)లో ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో పాల్గొన్న మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను కింది స్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. 2 వారాల పాటు ఉధృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. అలాగే మంత్రులు, ప్రజా ప్రతినిధులు సైతం జనాల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమాన్ని వివరించాలన్నారు. ప్రభుత్వం కంటే కూడా పథకాలపైనే జనాలు మాట్లాడేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు తెలిపామని.. ఇక నుంచి మరింత స్పీడు పెంచాలని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.






