సినిమాల్లోకి రావడానికి ముందు 96 కేజీల బరువు ఉండేదాన్ని.. స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

తన శారీరక బరువును ఎలా తగ్గించుకుందో రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది సారా అలీఖాన్.

సినిమాల్లోకి రావడానికి ముందు 96 కేజీల బరువు ఉండేదాన్ని.. స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ వారసురాలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్. తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ‘పతి పత్ని ఔర్ వోదో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది. సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే 15న విడదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇందిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ సినిమాల్లోకి రాకముందు తాను 96 కేజీల బరువు ఉండగా.. దాన్ని తగ్గించడం కోసం ఎంత కష్టపడిందో చెప్పుకొచ్చింది.

‘నేను న్యూయార్క్‌లో చదువుకునేటప్పుడు ప్రతిరోజూ రెండు మీడియం పిజ్జాలు ఆర్డర్ చేసుకునేదాన్ని. మూడు చాకోచిప్ బ్రౌనీలతో నా రోజు స్టార్ట్ అయ్యేది. అలాగే ఒకేసారి 6 వడా పావ్‌లు తినేదానిని.. పావ్ భాజీని ఎక్కువ వెన్నతో, బిర్యానీని ఎక్కువ ఆలుతో తినేదాన్ని. సినిమాల్లోకి రాకముందు నా బరువు 96 కేజీలు ఉండేది. అయితే.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు ఫిట్ నెస్‌పై ఫోకస్ పెట్టాను. బరువు తగ్గించే ప్రయాణంలో కఠినమైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించి ఏకంగా 45 కిలోల బరువు తగ్గాను. అయితే నాకున్న పీసీఓఎస్ (PCOS) సమస్యలను అధిగమించడానికి, ఫిట్‌నెస్‌తో ఈ మార్పును సాధించాను. దీని కోసం.. నాకు ఇష్టమైన జంక్ ఫుడ్, నూనెలో వేయించిన స్నాక్స్, చక్కెర (షుగర్), పాలతో తయారు చేసేవాటికి దూరంగా ఉండేదాన్ని. ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన ఆహారం, కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే డైట్‌ను ఫాలో అయ్యేదాన్ని. అలాగే కేవలం డైట్ మాత్రమే కాకుండా.. వ్యాయామం తప్పకుండా చేసేదాన్ని. ఎందుకంటే బరువు తగ్గడం అనేది నా కెరీర్ కోసం మాత్రమే కాదు.. శారీరక, మానసిక శ్రేయస్సు కోసం. పీసీఓఎస్ కంట్రోల్ అవ్వడానికి, ఆత్మవిశ్వాసం పెరగడానికి ఇది బాగా ఉపయోగపడింది. శరీరంలో త్వరగా మార్పులు వస్తుంటాయి. కాబట్టి మనం తినే ఆహారంపై శ్రద్ధ కచ్చితంగా ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story