- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా సమస్యల పరిష్కారానికే 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక': ఆర్డీవో
పట్టణ ప్రజల దేనికైనా తక్షణ పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'ను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆర్డీవో రమేష్ బాబు పేర్కొన్నారు.

దిశ,హుజూరాబాద్ రూరల్: పట్టణ ప్రజల దేనికైనా తక్షణ పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'ను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆర్డీవో రమేష్ బాబు పేర్కొన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వార్డుల్లో గురువారం వార్డు సభలు నిర్వహించారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో రమేష్ బాబు మాట్లాడుతూ.. ప్రజలు తమ వార్డుల్లోని ప్రతి ఒక్క సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని, సంబంధిత వార్డు ఆఫీసర్లకు లిఖితపూర్వకంగా దరఖాస్తులు అందించాలని సూచించారు.
సమస్యల గుర్తింపు..
మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ.. వార్డుల్లో నెలకొన్న డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి ఈ సభలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. వార్డు అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను స్వీకరించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, ఏఈ శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, స్థానిక వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు.






