- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడు నాగచైతన్య పర్సనాలిటీ రైట్స్ కేసు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
టాలీవుడ్ నటుడు నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగచైతన్య వ్యక్తిగత హక్కులకు (Personality Rights) భంగం కలగకుండా ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా అశ్లీల కంటెంట్, అసభ్యకరమైన రీతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించిన చిత్రాలు (Images), వీడియోలను ఇంటర్నెట్‌లో ప్రసారం చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి, వాటిపై నిషేధం విధించింది. ఓ సెలబ్రిటీ పేరు, వాయిస్, ఫొటోలు, వ్యక్తిత్వాన్ని వారి అనుమతి లేకుండా వాణిజ్యపరంగా తప్పుడు మార్గాల్లో ఉపయోగించకుండా ఉండేందుకు ఢిల్లీ హైకోర్టు రక్షణ కల్పించింది. ఇటీవల కాలంలో సెలబ్రిటీల ముఖాలను డీప్‌ఫేక్ (Deepfake) టెక్నాలజీ ద్వారా అశ్లీల చిత్రాలలో, అసభ్యకరమైన సన్నివేశాలలో సృష్టిస్తున్న తరుణంలో, నాగచైతన్యకు సంబంధించి అలాంటి కంటెంట్‌ను వ్యాప్తి చేయడాన్ని హైకోర్టు పూర్తిగా అడ్డుకుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఇలాంటి అభ్యంతరకరమైన కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని, ప్రసారాలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
కాగా, గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, రజనీకాంత్ వంటి అగ్ర నటులు కూడా తమ పర్సనాలిటీ రైట్స్ కోసం కోర్టును ఆశ్రయించి ఇలాంటి రక్షణను పొందారు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి నాగచైతన్య కూడా తన డిజిటల్ భద్రత, వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకునేందుకు ఈ చట్టపరమైన విజయాన్ని సాధించారు.






