- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటపాటలతో చదువు.. ఈ ప్రభుత్వ టీచర్ కృషికి సర్వత్రా ప్రశంసలు
తనకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చిందని ఆమె అంతటితో సరిపెట్టుకోలేదు. తన ఉద్యోగాన్ని మరింత బాధ్యతగా భావించి వినూత్న బోధనా పద్ధతులను, సృజనాత్మకత ఏకంగా విద్యాశాఖ మంత్రి చేత ప్రశంసలు అందుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ బడి అంటే.. పాత బెంచీలు, మూస పద్ధతిలో బోధన తీరు. ఇదే మెజారిటీ తల్లిదండ్రుల్లో ఉండే అభిప్రాయం. దాంతో తమ స్థోమత కాదని తెలిసినా ఇంత చదువు చెప్పించాలనే తాపత్రయంతో తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించి అప్పుల పాలవుతున్నవారు ఉన్నారు. కానీ ఇదంతా ఒకనాటి మాట. కాలం మారినట్లు సర్కార్ బడి స్థితుగతులతో పాటు బోధనా తీరుతెన్నులు మారాయి. సోషల్ మీడియా విప్లవాన్ని వాడుకుంటూ మన ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాబోధనలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. తమదైన రీతిలో విద్యార్థులకు సులభంగా పాఠాలు చెప్పడమే కాకుండా ఆటపాటలతో పిల్లకు చదువు చెబుతున్న తీరు అందరిని ఆకట్టుకుంటోంది. తాజాగా ఒక ప్రభుత్వ టీచర్ చేసిన వినూత్న ప్రయోగానికి సాక్షాత్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే ఫిదా అయిపోయారు. ఇంతకీ ఎవరా టీచర్? ఆమె ఏం చేశారో ఈ స్టోరీ చదివేయండి..
ఆటపాటలతో చదువు:
విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి మండల ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‍గా విధులు నిర్వహిస్తున్న పల్టా సింగి అలివేలి మంగ అనే ఉపాధ్యాయురాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన అలివేలి మంగ ఇప్పుడు ప్రభుత్వ టీచర్‍గా మారి ఎందరో విద్యార్థులకు మూసధోరణిలో కాకుండా విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పుస్తకాల్లోని పాఠాలను బట్టీ పట్టించడం కాకుండా.. ఆటపాటలతో పిల్లలకు చదువు చెప్తున్నారు. విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీస్తూ.. చదువుపై పిల్లల్లో అద్భుతమైన ఆసక్తిని పెంచుతున్నారు. స్కూల్ అంటే విద్యార్థులకు సహజంగా ఉండే భయం పోగొట్టేందుకు ఆమె అనుసరిస్తున్న బోధనా విధానాలు స్టూడెంట్స్ ను క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చేస్తున్నాయి. తన టీచింగ్ కు సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. అయితే విద్యార్థులకు చదువు చెప్పడంతో తన పని అయిపోయిందని చేతులు దులుపుకోకుండా ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరిస్తూ వీడియోలను తీసి అందరికి తెలిసేలా చేస్తోందీ టీచర్.
మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు:
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ప్రభుత్వ పాఠశాలల్లో తమదైన శైలిలో విద్యార్థులకు బోధనలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులను సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్న విషయం తెలిసిందే. పల్టా సింగి అలివేలి మంగ వినూత్న బోధనా పద్ధతిని సైతం నారా లోకేశ్ ప్రశంసించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్న ఆమెను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'పల్టాసింగి అలివేలి మంగ గారు విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పుతున్న తీరు చాలా బాగుంది. Learning made easy with “Activities” టీచింగ్ విధానంతో చదువు పట్ల పిల్లలు ఆసక్తి కనబరిచేలా విధులు నిర్వర్తిస్తున్న టీచర్ గారికి అభినందనలు. Unique innovative Teaching methods, No Bag Day Activities, Word Building, FLN Based Learning వంటి అంశాలను పిల్లలకు బోధిస్తూ.. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న టీచర్ పల్టాసింగి అలివేలి మంగ గారి కృషి ప్రశంసనీయం.' అంటూ గతంలోనే ప్రశంసించగా నెటిజన్లు మాత్రం ఈ ఉపాధ్యాయురాలి కృషిని నిరంతరం ప్రశంసిస్తూనే ఉన్నారు. అలివేలి మంగ లాంటి టీచర్లు ప్రతి బడిలోనూ ఉంటే.. మన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోతాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.






