క్లైమాక్స్ కు ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు తీగల, దీపక్ రెడ్డి హాజరు

by Prasad Jukanti |

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. కమాండ్ కంట్రోల్ వేదికగా తీగల కృష్ణారెడ్డి, దీపక్ రెడ్డిలను అధికారులు విచారించారు.

క్లైమాక్స్ కు ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు తీగల, దీపక్ రెడ్డి హాజరు
X

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్లైమాక్స్‌కు చేరింది. ప్రత్యేక విచారణ బృందం (SIT) ఈ కేసులో తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ఈ నెల (జూన్) లోనే సమగ్రమైన ఛార్జిషీట్‌ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్న సిట్ అక్రమ నిఘా, ఫోన్ల ట్యాపింగ్‌కు గురైనట్లు భావిస్తున్న పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేస్తూ సమాచారాన్ని సేకరిస్తోంది. తాజా విచారణలో భాగంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నేత లంకాల దీపక్ రెడ్డి గురువారం సిట్ అధికారుల ముందు హాజరయ్యారు.

స్టేట్ మెంట్ రికార్డు:

కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా విచారిస్తున్న సిట్ అధికారులు.. 2014-18 మధ్యకాలంలో మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన వ్యక్తిగత, రాజకీయ ఫోన్ సంభాషణలను అప్పటి నిఘా విభాగం అక్రమంగా ట్యాప్ చేసిందంటూ తీగల కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణారెడ్డి గత ఎన్నికల సమయంలో మా ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసి, మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు. దీని వెనుక ఉన్న పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story