పల్లె ప్రకృతి వనం అగ్నికి ఆహుతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-04 11:17:14  IST  )

మండలంలోని దస్రు తండా పల్లె ప్రకృతి వనం మూడు రోజుల క్రితం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది.

పల్లె ప్రకృతి వనం అగ్నికి ఆహుతి
X

దిశ, గీసుగొండ: మండలంలోని దస్రు తండా పల్లె ప్రకృతి వనం మూడు రోజుల క్రితం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని ఘటన జరిగి మూడు రోజుల కావస్తున్న అధికారులు ఎందుకు ఇంత నిర్లక్షం వహిస్తున్నారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏపుగా పెరిగిన చెట్లు, మొక్కలు కాలి బూడిదయ్యాయి. లక్షలు ఖర్చు, కొన్ని సంవత్సరాలు వనం అభివృద్ధి చేస్తే ఒక్క రాత్రిలోనే బూడిదగా మారాయని వన ప్రేమికులు అంటున్నారు. పంచాయతీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఈ ఘాతుకానికి పూనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story