రూ.6.25ల లక్షల విలువ గల ఆసిస్ గంజాయి పట్టివేత

by Nallavelli.Anjaneyulu |

రూ.6.25ల లక్షల విలువ గల ఆసిస్ గంజాయి (లిక్విడ్) స్వాధీనం చేసుకున్న సంఘటన ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

రూ.6.25ల లక్షల విలువ గల ఆసిస్ గంజాయి  పట్టివేత
X

దిశ, ఏటూరు నాగారం : రూ.6.25ల లక్షల విలువ గల ఆసిస్ గంజాయి (లిక్విడ్) స్వాధీనం చేసుకున్న సంఘటన ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎస్సై బి మహేష్ పి సి లు హరీష్, చంద్రమోహన్, సదానందం, సుధాకర్, కే మహేందర్ లతో జీడివాగు వద్ద సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ నల్ల రంగు బజాజ్ ప్లాటినా మోటార్ సైకిల్ పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొండికుంట మండలం మల్లెల మడుగు గ్రామంకు చెందిన నల్లగట్ల సురేంద్ర కుమార్, అదే జిల్లా అదే మండలం అదే గ్రామానికి చెందిన బండ్ల సాయి అనే ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రలోని శిరోంచ వైపు హాసిస్ ఆయిల్ (లిక్విడ్ గంజాయి) ను విక్రయించడానికి తరలిస్తున్న క్రమంలో కీడువాగు వద్ద పోలీసులు అడ్డగించి పట్టుకున్నారని తెలిపారు. ఈ మేరకు నిందితులను విచారించగా ఒడిస్సా రాష్ట్రంలోని కుముర మానూరు నివాసి రాజు నాయక్ అనే వ్యక్తి నుండి హాసిస్ ఆయిల్ (లిక్విడ్ గంజాయి) కొనుగోలు చేసి అమ్మటానికి వెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను ఇద్దతిని పంచుల సమక్షంలో వారిని అరెస్ట్ చేసి వారి వద్ద గంజాయి లిక్విడ్ ఆయిల్ రెండు వాహనాలు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోర్టులో హాజరు పరుచున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Next Story