గ్రీన్ ఏపీనే లక్ష్యం.. సీఎం చంద్రబాబు సంచలన పిలుపు

by Vemula.Srinu Prasad |

ర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు....

గ్రీన్ ఏపీనే లక్ష్యం.. సీఎం చంద్రబాబు సంచలన పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(World Environment Day) పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుకోవడం బాధ్యతని, శుక్రవారం ఒక దృఢ సంకల్పం చేద్దామని ఆయన కోరారు. గాలి, నీరు, నేల వంటి ప్రకృతి వనరులు కలుషితం కాకుండా కాపాడుకునేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని చంద్రబాబు చెప్పారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పచ్చదనం, ఇంధన పొదుపు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని, అలాగే ఇంధన వనరులను పొదుపుగా వినియోగించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని, శుక్రవారం నాడు అందరూ సైకిళ్లు లేదా ఈ-సైకిళ్లపై ప్రయాణించి పర్యావరణ హితానికి మద్దతు తెలపాలని చంద్రబాబు కోరారు.

నేను సైతం...

ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం కానున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నం పర్యటనలో తాను స్వయంగా సైకిల్‌పై ప్రయాణించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రయాణం ద్వారా ప్రజల్లో పర్యావరణ స్పృహను, పరిరక్షణ సందేశాన్ని బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story