- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడు గంటలపాటు సాగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక బిల్లులకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సుమారు మూడు గంటలపాటు సాగింది. ఈ భేటీలో కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ -2025, ఏపీ ఏవియేషన్ పాలసీ -2026పై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ సమావేశంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్ పై కూడా మంత్రివర్గం చర్చించింది. అలాగే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అలాగే మానవ అవయవ మార్పిడి చట్టం అమలుడు ఆర్డినెన్స్ ను జారీచేసే ప్రతిపాదన, చీరాల, విశాఖలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు, ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు, జలవనరులశాఖలో పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పనులకు కేబినెట్ అనుమతులు మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ వంటి డిపాజిటర్ల కేసుల పరిష్కారానికై 21 పోస్టుల్ని నియమించేందుకు గ్రీన్ సిగ్నలిచ్చింది. చిత్తూరు జిల్లాలో వ్యవసాయశాఖ భూమిపై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై మంత్రిమండలి చర్చించింది. అదేవిధంగా ఎన్ఆర్ఈడీక్యాప్ నకు 30 ఏళ్లు లీజు ఇచ్చేందుకు కూడా అనుమతినిచ్చింది. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు హడ్కో నుంచి రూ.300 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక కృష్ణానదీతీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు అభివృద్ధి టెండర్లకు మంత్రివర్గం పర్మిషన్ ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతులిచ్చింది. నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలో సవరణలతో పాటు వివిధ సంస్థలకు భూములు కేటాయించే విషయాలపై చర్చించి, వాటికి ఆమోదం తెలిపింది. జులై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వీబీ జీ రామ్ జీ (Viksit Bharat - Guarantee for Rozgar and Ajeevika Mission) అమలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.






