- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాన్నకు ప్రేమతో నైవేద్యంగా సిగరెట్.. యువతి వీడియో వైరల్
సోషల్ మీడియా లైక్స్, వ్యూవ్స్ పిచ్చితో జనాలు ఏది పడితే అది చేస్తున్నారు. పాపులారిటీ పెంచుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. ఈ పిచ్చితో కొన్నిసార్లు సంస్కృతి, సంప్రదాయాలను సైతం పాడు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి చేసిన వీడియో నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా లైక్స్, వ్యూవ్స్ పిచ్చితో జనాలు ఏది పడితే అది చేస్తున్నారు. పాపులారిటీ పెంచుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. ఈ పిచ్చితో కొన్నిసార్లు సంస్కృతి, సంప్రదాయాలను సైతం పాడు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి చేసిన వీడియో నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సాధారణంగా చనిపోయిన వ్యక్తుల వర్థంతి లేదా జయంతి రోజున వారికి నచ్చిన ఆహారాలు ఫోటో ముందు పెట్టి వారిని తలుచుకుంటారు. ఇష్టమైన ఆహారం ఫోటో ముందు పెట్టడం ద్వారా చనిపోయినవాళ్లు తింటారని ఓ నమ్మకం. అయితే ఇటీవల కొంతమంది సోషల్ మీడియా లైకుల కోసం కేవలం కేవలం ఆహారం మాత్రమే పెట్టకుండా వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. సాధారణంగా ఆహారంతో పాటు మద్యం కూడా ఆరగిస్తారు.
కానీ అది కొంతవరకే కానీ రీసెంట్ గా ఓ యువకుడు అనేక బ్రాండ్ల మద్యాన్ని తన తండ్రి ఫోటో వద్ద ఏర్పాటు చేయగా ఆ ఫోటో వైరల్ అయ్యింది. దీంతో చాలా మంది ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మరో యువతి కూడా అలాంటి పనే చేసింది. తన తండ్రి ఫోటో వద్ద ఆహారాన్ని నైవేద్యంగా పెట్టిన యువతి ఓ సిగరెట్ కూడా నైవేద్యంగా పెట్టింది. తానే స్వయంగా సిగరెట్ నోట్లో పెట్టుకుని దానిని అంటించి ఫోటో వద్ద పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. నాన్న నువ్వు రంభ, మేనక, ఊర్వశిలో చిల్ అవుతున్నావని అనుకుంటున్నా. వారికి ఫెమినిజం గురించి నేర్పిస్తావని ఆశిస్తున్నా.. అంటూ రాసుకొచ్చింది. యువతి చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. లైక్స్ కోసం పిచ్చివేశాలు అవసరమా అని కామెంట్ చేస్తున్నారు.






