కుటుంబ క‌ల‌హాల‌తో భార్యను హ‌త్య చేసిన భ‌ర్త

by Nallavelli.Anjaneyulu |

కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో భార్య‌ను భ‌ర్త హ‌త్య చేసిన సంఘ‌ట‌న కూక‌ట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

కుటుంబ క‌ల‌హాల‌తో భార్యను హ‌త్య చేసిన భ‌ర్త
X

దిశ, బాలానగర్ : కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో భార్య‌ను భ‌ర్త హ‌త్య చేసిన సంఘ‌ట‌న కూక‌ట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఖైత‌లాపూర్ చెందిన ర‌హీం, సుమేరా దంప‌తులు. వీరి మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా కుటుంబ క‌ల‌హాలు కొన‌సాగుతున్న‌ట్టు స‌మాచారం. ఈ త‌రుణంలోనే వీరి మ‌ధ్య చోటు చేసుకున్న వాగ్వాదం తీవ్ర రూపం దాల్చ‌డంతో భ‌ర్త ర‌హీం త‌న భార్య సుమేరా ను హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. హ‌త్య అనంత‌రం ర‌హీం స్వ‌యంగా కూక‌ట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కి వెళ్లి లొంగిపోయాడు. ఆటో డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తున్న ర‌హీంను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Next Story