- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజాంపేటలో ఇంటిపై పిడుగు.. ధ్వంసమైన వాటర్ ట్యాంక్
by Taduka Kalyani |
గురువారం కురిసిన భారీ వర్షాల సందర్భంగా నిజాంపేటలో ఓ ఇంటిపై పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

X
దిశ, నిజాంపేట : గురువారం కురిసిన భారీ వర్షాల సందర్భంగా నిజాంపేటలో ఓ ఇంటిపై పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన పంజా శ్రీనివాస్ నివాసంలోని నాలుగో అంతస్తుపై పిడుగు పడడంతో భవనంపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ పూర్తిగా ధ్వంసమైంది. పిడుగు పడిన సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. ఘటన సమాచారం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షాలు, ఉరుములు-మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story






