ఆదిలాబాద్‌కు భారీ ఎయిర్‌పోర్టుకు మార్గం సుగుమం..

by Taduka Kalyani |

తెలంగాణలో శంషాబాద్ తర్వాత మరో భారీ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఆదిలాబాద్‌లో అడుగులు వేగంగా పడుతున్నాయి.

ఆదిలాబాద్‌కు భారీ ఎయిర్‌పోర్టుకు మార్గం సుగుమం..
X

దిశ,ఆదిలాబాద్ : తెలంగాణలో శంషాబాద్ తర్వాత మరో భారీ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఆదిలాబాద్‌లో అడుగులు వేగంగా పడుతున్నాయి. రక్షణ శాఖ,సివిల్ ఏవియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 1,980 ఎకరాల్లో జాయింట్ ఎయిర్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ప్రాజెక్టు కోసం అదనంగా అవసరమైన భూమిని కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే విమానాల రాకపోకలకు అడ్డంకిగా ఉన్న 740 కేవీ విద్యుత్ లైన్ల తొలగింపుకు కూడా అంగీకారం తెలిపింది. ఈ అంశంపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ మహంతిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పత్రాన్ని అందజేశారు.ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా రానుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి,ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Next Story