- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొంపల్లి గ్రామంలో విషాదం.. ఇంటికి చేరాల్సిన అన్నదమ్ములు తిరిగిరాని లోకాలకు!?
ఇంటికి చేరి కుటుంబ సభ్యులతో గడపాల్సిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో చర్ల మండలంలోని గొంపల్లి గ్రామం శోకసంద్రంగా మారింది.

దిశ,దుమ్ముగూడెం: ఇంటికి చేరి కుటుంబ సభ్యులతో గడపాల్సిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో చర్ల మండలంలోని గొంపల్లి గ్రామం శోకసంద్రంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చిన్న బండిరేవు ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో గొంపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు చుంచు సతీష్, చుంచు చరణ్ సాయి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఢీకొన్న తీవ్రతకు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విషాదంలో గొంపల్లి..
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి మృతి చెందడంతో గొంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద వార్త తెలిసిన వెంటనే గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి, ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కలచివేశాయి.
తల్లిదండ్రులకు తీరని కడుపుకోత..
ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారులు తిరిగి క్షేమంగా వస్తారని ఎదురు చూసిన తల్లిదండ్రులకు ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. క్షణాల వ్యవధిలో ఇద్దరు కుమారులను కోల్పోవడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. అన్నదమ్ముల అకాల మరణంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. యువకుల మృతి పై గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.






