- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంటి తుడుపు చర్యలతో ఆగని ఇసుక అక్రమ దందా
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

దిశ, లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రెవెన్యూ, ఫారెస్ట్ అధికా రుల కంటి తుడుపు చర్యలతో ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. శెట్పల్లి- సంగారెడ్డి పెద్దవాగు నుంచి ప్రతిరోజు సుమారు 50 ట్రాక్టర్లు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నాయి. అయినప్పటికీ సంబంధిత రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో విఫలమవుతు న్నారు. ఇసుక అక్రమ రవాణా పై గత నెల 12న దిశ దినపత్రికలో "యదేచ్చగా ఇసుక దోపిడి" అనే శీర్షిక న వార్త రావడంతో స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించారు. శెట్పల్లి సంగారెడ్డి, మాలపాటి గ్రామల శివారులో ని ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేశారు. రెండు రోజుల అనంతరం ఇసుక డంపులను వేలం వేశారు. అయినప్పటికీ ఇసుక మాఫియా ఆగడాలు ఆగడం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరా యంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
రోజుకు వంద నుంచి 150 ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సంబంధిత శాఖల అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరి స్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొందరు గ్రామ పాలన అధికారులు ఇసుక అక్రమ రవాణా దారులతో కుమ్మక్కై నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు వందలాది ట్రిప్పుల ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున వర్షాలు కురిస్తే వాగులోకి ట్రాక్టర్లు వెళ్లేందుకు వీలుపడదనే కారణంతో ఇసుక మాఫియా లీడర్లు పోటాపోటీగా ఇసుకను తవ్వేస్తున్నారు. వాగుల నుంచి తీసుకువచ్చిన ఇసుకను శెట్పల్లి సంగారెడ్డి, మాలపాటి, పర్మల్ల గ్రామాల శివారులలో డంపు చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.






