భ‌వ‌న నిర్మాణ కార్మికుడు ప్ర‌మాద‌వ‌శాత్తు మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-04 15:42:14  IST  )

భ‌వ‌న నిర్మాణ కార్మికుడు ప్ర‌మాద‌వ‌శాత్తు మృతి చెందిన సంఘ‌ట‌న మేడ్చ‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

భ‌వ‌న నిర్మాణ కార్మికుడు ప్ర‌మాద‌వ‌శాత్తు మృతి
X

దిశ‌, మేడ్చ‌ల్ : భ‌వ‌న నిర్మాణ కార్మికుడు ప్ర‌మాద‌వ‌శాత్తు మృతి చెందిన సంఘ‌ట‌న మేడ్చ‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం పై స్టీల్ రాడ్లను పైకి లాగుతున్న భవన నిర్మాణ కార్మికుడు రవి (32) ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Next Story