విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాములు దగ్ధం

by Jakkula.Mamatha |

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాములు దగ్ధమైన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో జరిగింది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాములు దగ్ధం
X

దిశ, గరిడేపల్లి : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాములు దగ్ధమైన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడెల్లి శ్రీను, భిక్షం, మట్టయ్య, మామిడి మట్టయ్యలకు చెందిన 40 ఎకరాల గడ్డి వాములు మంటల్లో కాలి బూడిదయ్యాయి. దీంతో సుమారు రెండు లక్షల రూపాయల నష్టం జరిగిందని దీనంతటికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఈపిఎల్ స్టోన్ క్రషర్ యాజమాన్యం, అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి వేగవంతమైన చర్యలతో పెద్ద ప్రమాదం తప్పింది. పశువుల మేత కోసం నిల్వ ఉంచిన గడ్డి అగ్నికి ఆహుతి కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నష్టాన్ని పరిశీలించి బాధితులకు తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.

Next Story