రేపు 'డ్రగ్స్ రహిత క్యాంపస్' అవగాహన సదస్సు

by Muthe.Rajitha |

విద్యార్థులు, యువతను మాదకద్రవ్యాల మహమ్మారి నుండి రక్షించేందుకు విద్యాశాఖ సమన్వయంతో 'భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్' రాష్ట్ర అసోసియేషన్ ఒక ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.

రేపు డ్రగ్స్ రహిత క్యాంపస్ అవగాహన సదస్సు
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థులు, యువతను మాదకద్రవ్యాల మహమ్మారి నుండి రక్షించేందుకు విద్యాశాఖ సమన్వయంతో 'భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్' రాష్ట్ర అసోసియేషన్ ఒక ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్‌లోని తెలంగాణ లోక్ భవన్ వేదికగా రాష్ట్ర స్థాయి మాదకద్రవ్యాల నివారణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులను సరైన మార్గంలో నడిపించేందుకు స్కాట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లను ఫస్ట్ రెస్పాండర్స్ గా తీర్చిదిద్దడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 400 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఉదయం 8.30 గంటలకు దోమల్‌గూడలోని స్కౌట్స్ కార్యాలయం నుండి లోక్ భవన్ వరకు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహిస్తారు.

ఉదయం 10.30 సంస్కృతి హాల్‌లో ప్రారంభమయ్యే ఈ శిక్షణలో ప్రస్తుత డ్రగ్స్ పరిస్థితి, ప్రమాదంలో ఉన్న విద్యార్థులను గుర్తించే విధానం, కౌన్సెలింగ్, హెల్ప్‌లైన్ల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. తెలంగాణ ఈగిల్ ఫోర్స్, టెలిమానస్ సహకారంతో ప్రత్యేక సెషన్లు ఉంటాయి. నార్కోటిక్స్, ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ చట్టపరమైన చిక్కులు, విద్యాసంస్థల బాధ్యతలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం జరిగే ముగింపు వేడుకకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని, విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story