బిగ్ అల‌ర్ట్..అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆ జిల్లాల్లో వర్షాలు

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బిగ్ అల‌ర్ట్..అర్ధరాత్రి ఒంటి గంట వరకు ప‌లు జిల్లాల్లో వర్షాలు ఉన్నాయ‌ని స‌మాచారం.

బిగ్ అల‌ర్ట్..అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆ జిల్లాల్లో వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ అర్ధరాత్రి ఒంటిగంట వరకు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఖమ్మం, మేడ్చల్, హైదరాబాద్, మహబూబాబాద్, వరంగల్, సిరిసిల్ల, నల్గొండ, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. భారీ వర్షం పడే సూచనలు ఉన్న తరుణంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అటు హైదరాబాద్ మహా నగరంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. దీంతో ట్రాఫిక్ జామ్ విపరీతంగా చోటు చేసుకుంటోంది. భారీ వ‌ర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్ర‌జ‌లు అల‌ర్ట్ ఉండాల‌ని, బ‌య‌ట‌కు అస్స‌లు వెళ్ల‌కూడ‌ద‌ని అధికారులు సూచ‌న‌లు చేస్తున్నారు.

Next Story