- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WagonR: భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయెల్ కారు
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి గురువారం ఈ కారును ఆవిష్కరించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆటోమొబైల్ రంగంలో కీలక మైలురాయిగా, మారుతీ సుజుకి దేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ప్యాసింజర్ కారును ఆవిష్కరించింది. ఫ్లెక్స్-ఫ్యూయెల్ వ్యాగన్ఆర్ పేరుతో మార్కెట్లోకి తెచ్చిన ఈ మోడల్, సాధారణ పెట్రోల్‌తో పాటు అధిక ఇథనాల్ మిశ్రమాలతో కూడా పనిచేయగలదు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి గురువారం ఈ కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకౌచి మాట్లాడుతూ, ఇది కేవలం కొత్త కారు లాంచ్ మాత్రమే కాదు. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను కట్టడి చేయడం, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా భారత ఇంధన రంగంలో ఒక కొత్త దశకు నాంది. ఫ్లెక్స్‌ఫ్యూయల్ టెక్నాలజీ వల్ల ఆటోమొబైల్ రంగానికే కాకుండా రైతులకు, ఇథనాల్ ఉత్పత్తిదారులకు కూడా మేలు చేకూరుతుందన్నారు. ఇక, ఫ్లెక్స్ ఫ్యూయెల్ వ్యాగన్ఆర్ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి రానుండగా, సాధారణ పెట్రోల్‌తో పాటు 85 శాతం వరకు ఇథనాల్ బ్లెండ్ చేసిన ఈ85 ఫ్యూయెల్‌తోనూ నడుస్తుంది. ప్రస్తుతానికి కంపెనీ ధర, ఇతర వివరాలు వెల్లడించలేదు. మార్కెట్ వర్గాల ప్రకారం, రూ.8.50 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.






