ఉత్తర తెలంగాణ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు

by velandi.Saikiran |

మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకుందని భోగ శ్రావణి తెలిపారు.

ఉత్తర తెలంగాణ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు
X

దిశ, జగిత్యాల టౌన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకుందని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ భోగ శ్రావణి తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారులను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఆమె వెల్లడించారు.

వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా ఉత్తర తెలంగాణలో రవాణా వ్యవస్థ బలోపేతం కానుందని, ఇందుకు కృషి చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ రహదారుల విస్తరణతో ఆ ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటమే కాకుండా రైతులు తమ పంటలను మార్కెట్లకు త్వరగా తరలించే అవకాశం కలుగుతుందన్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల వల్ల పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పెరిగి యువతకు ఉపాధి లభిస్తుందని, ఈ ప్రాజెక్టులు ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story