బాపట్లలో తేలిన అనిల్ రావిపూడి...కొత్త సినిమా కోసం భారీ ప్లాన్‌

by velandi.Saikiran |

బాపట్లలో తేలిన అనిల్ రావిపూడి...కొత్త సినిమా కోసం భారీ ప్లాన్ వేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

బాపట్లలో తేలిన అనిల్ రావిపూడి...కొత్త సినిమా కోసం భారీ ప్లాన్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నారు. కానీ ఇందులో కొంత మంది మాత్రమే సక్సెస్ అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి... ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ లేకుండా ముందుకు దూసుకు వెళ్తున్నాడు. ఒక్కసారైనా దొరుకుతాడు అనుకుంటే..ఎవ‌రికీ చిక్క‌కుండా స‌క్సెస్ తో దూసుకు వెళ్తున్నాడు. మొన్న సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, ఇప్పుడు మరో సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ మేరకు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. గురువారం రోజున ఆయన స్వగ్రామం బాపట్ల చిలుకూరి వారి పాలెం లోని ఆంజనేయ స్వామి సన్నిధిలో స్క్రిప్ట్ కు పూజలు కూడా చేయించారు.

ఆ తర్వాత తల్లిదండ్రులు బ్రహ్మయ్య, అనంతలక్ష్మి చేతుల మీదుగా ఆ స్క్రిప్ట్ అందుకున్నారు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం చోటు చేసుకుంది. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ ఇద్దరు హీరోలతో గతంలో వేరు వేరుగా సినిమాలు చేశారు కానీ ఈ సారి మాత్రం ఇద్దరిని కలిపి, ఓ ఫ్యామిలీ ఎంటర్ టైన‌ర్ తీసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా మరో 10-15 రోజుల్లో షూటింగ్ కూడా ప్రారంభించుకొని ఉన్నట్లు టాక్ నడుస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట అనిల్. ఈ మేరకు షూటింగ్ ఫినిష్ చేసి, అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని సిద్ధమవుతున్నారట.

Next Story