- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి వచ్చేసిన ధురంధర్ 2..ఆ 33 నిమిషాలు అదనం !
ఓటీటీలోకి ధురంధర్ 2 సినిమా వచ్చేసింది. దీంతో థియేటర్లలో చూడని వాళ్లు ఇప్పుడు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ధురంధర్ : ది రివెంజ్ (Dhurandhar 2) సినిమా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ముందు కలెక్షన్స్ వర్షం కురిపించింది. రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి... సరికొత్త చరిత్ర సృష్టించింది. రణవీర్ సింగ్ హీరోగా చేసిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్ స్టార్ లో ఈ మూవీ జూన్ 4వ తేదీన రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ అయింది.
దీంతో థియేటర్ లో మిస్సయిన వాళ్లు.. జియో హాట్ స్టార్ లో తిలకించవచ్చు. మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. OTT లోకి వచ్చిన ఈ సినిమాలో కొన్ని సీన్స్ అదనంగా యాడ్ చేశారు. దీంతో థియేట్రికల్ రన్ టైం మూడు గంటల 49 నిమిషాలు కాగా... OTTలో మాత్రం మూడు గంటల 52 నిమిషాలుగా ఉంది. కాగా రణవీర్ సింగ్, మాధవన్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.






