అమీర్‌పేట్‌ అగ్నిప్రమాదం.. మెట్రోకు నష్టం జరగలేదు : HMRL MD సర్ఫరాజ్ అహ్మద్

by Muthe.Rajitha |

అమీర్‌పేట్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల పక్కనే ఉన్న మెట్రోరైలు వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగలేదని HMRL MD సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు.

అమీర్‌పేట్‌ అగ్నిప్రమాదం.. మెట్రోకు నష్టం జరగలేదు : HMRL  MD సర్ఫరాజ్ అహ్మద్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అమీర్‌పేట్‌లోని మైత్రివనం సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం వల్ల పక్కనే ఉన్న మెట్రో రైలు వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగలేదని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. మెట్రో రైల్ వ్యవస్థ పూర్తిగా పనిచేస్తోందని, ప్రభావితమైన ఆస్తులపై లోతైన అంచనా వేయడం జరిగిందని ఆయన తెలిపారు. మెట్రో రైలు సేవలకు ఏ విధంగానూ అంతరాయం కలగలేదని, రైళ్ల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయని ఆయన పేర్కొన్నారు. దట్టమైన పొగ వల్ల కొంత అసౌకర్యం కలిగినా, మెట్రో రైలు కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. మెట్రో స్తంభాలపై అమర్చిన ప్రకటనల బోర్డుల వినైల్ షీట్లపై మాత్రమే అగ్నిప్రమాదం ప్రభావం ఉందని ఆయన వివరించారు. మెట్రో వ్యవస్థ నిర్మాణాలు, కట్టడాలకు నష్టం జరగలేదని మెట్రో ఎండీ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు.

Next Story