- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP TET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల
ఏపీ టెట్ (AP TET) - 2026 పూర్తి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ తీపికబురు చెప్పింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ‘X’ (ట్విట్టర్) వేదికగా ఏపీ టెట్ (AP TET) - 2026 పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. దీంతో పాటు ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌పై కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. టెట్ జూన్ 5 నుంచి జులై 5 వరకు అంటే నెల రోజుల పాటు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. జులై 25 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహించి సెప్టెంబర్ 15న తుది ఫలితాలు ప్రకటిస్తారు.
అక్టోబర్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్..
ఇక టెట్ షెడ్యూల్‌తో పాటు అభ్యర్థులకు మరో గుడ్‌న్యూస్ చెబుతూ డీఎస్సీ నోటిఫికేషన్ సమయాన్ని కూడా మంత్రి లోకేశ్ ఖరారు చేశారు. టెట్ ఫలితాలు విడుదలైన తర్వాత, 2026 అక్టోబరు నెలలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (DSC) నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లుగా మంత్రి స్పష్టం చేశారు. డీఎస్సీ రాసే అభ్యర్థులకు టెట్ స్కోర్ ఎంతో కీలకం కావడంతో, అర్హులైన అభ్యర్థులందరికీ అవకాశం కల్పించేందుకే ముందుగా టెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లుగా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి






