న‌కిలీ ప‌త్రాలు సృష్టించి స్థ‌లం క‌బ్జాయ‌త్నం చేసిన వ్య‌క్తి అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

నకిలీ లింక్ డాక్యుమెంట్స్ సృష్టించి స్థలం కబ్జాయత్నం చేసిన వ్యక్తిని కీసర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

న‌కిలీ ప‌త్రాలు సృష్టించి స్థ‌లం క‌బ్జాయ‌త్నం చేసిన వ్య‌క్తి అరెస్ట్
X
దిశ‌, నాగారం : నకిలీ లింక్ డాక్యుమెంట్స్ సృష్టించి స్థలం కబ్జాయత్నం చేసిన వ్యక్తిని కీసర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కీసర సీఐ ఆర్కపల్లి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. కీసర మండలం నాగారం సర్వే నంబర్ 355 లో గల స్థలంలో అమీర్ పాషా కు అద్దెకు ఇవ్వగా ఆ స్థలానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు తయారు చేసి ఆ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారని నాగారంకు చెందిన కట్కారి అంజిరెడ్డి గత నవంబర్ 6న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారునికి చెందిన స్థిరాస్తిపై అక్రమంగా హక్కు సాధించుటకు నకిలీ సేల్ డీడ్ సృష్టించి, దానిని నిజమైన పత్రంగా చూపించి కోర్టు, రిజిస్ట్రేషన్ అధికారుల ముందు ఉపయోగించినట్లు దర్యాప్తులో తమ వెల్లడైందన్నారు.

దర్యాప్తు సమయంలో సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి తీసుకున్న ధృవీక‌ర‌ణ‌ పత్రాల ఆధారంగా, పై సేల్ డీడ్ వాస్తవానికి ఫిర్యాదుదారు పేర్కొన్న సర్వే నెం.355 భూమికి సంబంధించినది కాదని, వేర్వేరు ప్రాంతాలకు చెందినదిగా నిర్ధారణ అయిందన్నారు. అలాగే సంబంధిత కార్యాలయ రికార్డుల ప్రకారం.. ఆ పత్రం నకిలీ/ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించామన్నారు. దర్యాప్తులో భాగంగా, ప్రధాన నిందితుడు ఆమీర్ పాషాను గురువారం అరెస్ట్ చేశామన్నారు. అతని వద్ద నుండి నకిలీ సేల్ డీడ్ కాపీ ని స్వాధీనం చేసుకోబడిందని అనంతరం నిబంధనల ప్రకారం, న్యాయస్థానం ముందు హాజరు పరిచయమన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

Next Story