పురుగుల మందు తాగి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-04 16:32:50  IST  )

పురుగుల మందు తాగి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న నాగిరెడ్డిపేట మండ‌లం ప‌ల్లెబోగుడ తండాలో చోటు చేసుకుంది.

పురుగుల మందు తాగి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, లింగంపేట : పురుగుల మందు తాగి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న నాగిరెడ్డిపేట మండ‌లం ప‌ల్లెబోగుడ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై భార్గ‌వ గౌడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప‌ల్లెబోగుడ తండాకు చెందిన ధ‌నావ‌త్ రెడ్యానాయ‌క్ బుధ‌వారం పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. చికిత్స పొందుతూ గురువారం ఉద‌యం మృతి చెందాడు. రెడ్యానాయ‌క్ ఫారెస్ట్ భూమి ఆక్ర‌మ‌ణ‌కు ప్ర‌య‌త్నించ‌గా.. అట‌వీ అధికారులు కేసు న‌మోదు చేశారు. భూమిసాగు విష‌యం పై కోర్టుల చుట్టూ తిరుగుతూ మాన‌సిక ఆందోళ‌న‌కు గురైన‌ట్టు తెలిపారు. బుధ‌వారం రోజు ఎల్లారెడ్డి మార్కెట్ కి కూర‌గాయ‌లు అమ్మ‌డానికి వెళ్తున్నాన‌ని ఇంటి నుంచి వెళ్లిన రెడ్యా సాయంత్రం కబురం కుంట శివారులో పురుగుల మందు తాగి అప‌స్మార‌క స్థితిలో ఉండ‌గా.. గ్రామ‌స్తులు గుర్తించి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. కుటుంబ సభ్యులు వైద్య చికిత్స నిమిత్తం హుటాహుటిన ఎల్లారెడ్డి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు చెప్పారు. భార్య ఆన్సి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భార్గవ గౌడ్ తెలిపారు.

Next Story