- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గుంతలు తవ్వారు.. పనులు మరిచారు’.. స్థానికులు ఆగ్రహం
కాంట్రాక్టర్‌కు.. స్థానిక ప్రజాప్రతినిధుల విభేదాల కారణంగా తాగునీటి పైప్ లైన్ పనులు మధ్యలో నిలిపేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దిశ, నల్లగొండ క్రైమ్: కాంట్రాక్టర్‌కు.. స్థానిక ప్రజాప్రతినిధుల విభేదాల కారణంగా తాగునీటి పైప్ లైన్ పనులు మధ్యలో నిలిపేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో జన సంచారం అధికంగా ఉండే ప్రాంతంలో గుంతల తవ్వి వదిలేయడంతో ప్రమాదకరంగా మారాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ 23వ డివిజన్‌లోని సహిదా మస్జిద్ నుంచి హైదర్‌ఖాన్‌గూడ, అఫ్జల్‌నగర్ వరకు తాగునీటి పైప్‌లైన్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
కాంట్రాక్టర్లు పెద్ద గోతులు తవ్వి సగం పని చేసిన తర్వాత పరస్పర విభేదాలతో పనులు ఆపివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే స్పందించడం లేదని, పని పూర్తి చేయబోనని చెబుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. పలుమార్లు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటికీ స్పందన కరువైందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులు పూర్తి చేసి గోతులు మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ఆందోళన చేపడుతామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.






