ED: రూ.899 కోట్ల బ్యాంక్ మోసం.. దీపక్ కేబుల్స్ ఎండీ వెంకటేశ్వర రావు అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-04 14:57:32  IST  )

రూ.899 కోట్లకు పైగా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో దీపక్ కేబుల్స్ ఎండీ కరుటూరి వెంకటేశ్వరరావును బెంగళూరులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

ED: రూ.899 కోట్ల బ్యాంక్ మోసం.. దీపక్ కేబుల్స్ ఎండీ వెంకటేశ్వర రావు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ బ్యాంక్ మోసం, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను దాదాపు రూ.899.35 కోట్లకు పైగా మోసం చేసిన ఆరోపణలపై దీపక్ కేబుల్స్ ఇండియా లిమిటెడ్ (DCIL) మేనేజింగ్ డైరెక్టర్ కరుటూరి వెంకటేశ్వరరావును ఈడీ అధికారులు బెంగళూరులో ఇవాళ అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా ఈడీ అధికారికంగా ప్రకటించింది.

లోన్ నిధుల మళ్లింపు.. ఈడీ దర్యాప్తులో షాకింగ్ నిజాలు

దీపక్ కేబుల్స్ కంపెనీ నిర్వాహకులు వివిధ బ్యాంకుల నుంచి భారీ స్థాయిలో లోన్లు తీసుకుని ఉన్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. అయితే, ఏ అవసరాల కోసమైతే ఈ లోన్లు తీసుకున్నారో.. ఆ నిధులను కంపెనీ వ్యాపారాలకు వాడకుండా, చట్టవిరుద్ధంగా ఇతర మార్గాల్లోకి మళ్లించినట్లుగా గుర్తించారు. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కూటమిని నమ్మించి, ఫేక్ డాక్యుమెంట్లు, నిధుల మళ్లింపు (Diversion of Funds) ద్వారా రూ.899.35 కోట్ల మేర నష్టం చేకూర్చారని కరుటూరి వెంకటేశ్వరరావుపై బలమైన ఆధారాలు లభించడంతో ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకుంది. అయితే, ఈ మొత్తం స్కామ్‌లో మరికొంత మంది ప్రమేయంపై కూడా అధికారులు విచారణ చేపడుతున్నారు.

వాయువేగం.. నడుస్తూనే మంటలార్పే సత్తా.. కేరళలో అత్యాధునిక అగ్నిమాపక వాహనాల ఎంట్రీ!

Next Story