మొహర్రం ఏర్పాట్లపై ఇంత నిర్లక్ష్యమా?: కల్వకుంట్ల కవిత

by Vemula.Srinu Prasad |

మొహర్రం ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు...

మొహర్రం ఏర్పాట్లపై ఇంత నిర్లక్ష్యమా?: కల్వకుంట్ల కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొహర్రం ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మొహర్రంకు ఇంకా 12 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన బీబీ కా ఆలమ్ ఊరేగింపులో పాల్గొనే ఏనుగును తెప్పించే ప్రక్రియ సైతం ప్రారంభించలేదని పేర్కొన్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,836 ఆషూర్ ఖానాలకు ఇవ్వాల్సిన నిధులపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మొహర్రంను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని.. వెంటనే సమీక్ష నిర్వహించి, ఏర్పాట్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story