ఆర్మూర్ లో ప్రియాంక‌, భార‌తి క్లినిక్ లు సీజ్

by Nallavelli.Anjaneyulu |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఎలాంటి అర్హత అనుభవం లేకుండా ఎంబీబీఎస్ బోర్డులను పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న నకిలీ డాక్టర్ల గుట్టురట్టు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ వైద్య శాఖలోని బృందంతో ఆర్మూరు పట్టణ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఆర్మూర్ లో ప్రియాంక‌, భార‌తి క్లినిక్ లు సీజ్
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఎలాంటి అర్హత అనుభవం లేకుండా ఎంబీబీఎస్ బోర్డులను పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న నకిలీ డాక్టర్ల గుట్టురట్టు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ వైద్య శాఖలోని బృందంతో ఆర్మూరు పట్టణ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ త‌నిఖీల్లో ప్రియాంక క్లినిక్, భారతి క్లినిక్ లను డీఎంహెచ్ఓ సీజ్ చేశారు. ప్రపంచం మొత్తం అత్యాధునిక హంగులతో నూతన పద్ధతులతో ఏఐ మార్కు పద్ధతులతో ప్రయాణిస్తుంటే ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మాత్రం తెలిసి తెలియని అమాయక‌ ప్రజలను ఏదో ఒక విధంగా మోసం చేస్తూ ఈ నకిలీ డాక్టర్లు అమాయక ప్రజలను మోసం చేస్తూ దండిగా డబ్బులు సంపాదించుకునే పనిలో పడ్డారు.


రాజకీయంగా ఎంతో చైతన్యవంతంగా ఉండే ఆర్మూర్ ప్రాంతంలోని మున్సిపల్ పరిధిలో సైతం ఇలాంటి నకిలీ డాక్టర్లు ఆర్మూర్ లో అమాయక ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడపడం అంటే విడ్డూరంగా ఉంది. ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గత కొద్ది సంవత్సరాలుగా ప్రియాంక క్లినిక్, భారతి క్లినిక్ లను ఏర్పాటు చేసుకొని వైద్యం అందిస్తున్నట్టు నటిస్తూ అమాయక ప్రజలను బురిడీ కొడుతూ డబ్బులను సంపాదించుకుంటున్నారు. ఎలాంటి ఎంబీబీఎస్ పట్టా లేకున్నా, వైద్యం అందించేందుకు విద్యార్హతలు లేనప్పటికీని నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిరాని వైద్యంతో శస్త్ర చికిత్సలు చేయడం, మహిళా రోగులకు వింత పద్ధతులతో వైద్యం అందిస్తున్నట్లు నటించడం విడ్డూరంగా నడిచింది. అయినప్పటికీ ఏమాత్రం భయం లేకుండా యధావిధిగా మళ్లీ క్లినిక్ లను తెరిచి అమాయక ప్రజలను మోసం చేస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విచారణ చేసిన డిప్యూటీ డీఎంహెచ్ ఓ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారులు క్లినిక్ లను సీజ్ చేసి పోలీస్ అధికారులకు రిపోర్ట్ ను అందజేశారు.

ప్రజలు ఇలాంటి నకిలీ డాక్టర్లను నమ్మవద్దని క్వాలిఫైడ్ ఉన్న డాక్టర్లతో వైద్యం చేయించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆమె అన్నారు. ప్రభుత్వ అధికారులకు ప్రజల సహకారం తప్పనిసరి అందించాలన్నారు.ఆర్మూర్ లోని పోలీస్ అధికారులు ఇట్టి క్లినిక్ నకిలీ డాక్టర్లపై కేసు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా డిఎంహెచ్ఓ రాజశ్రీ తెలపడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది.ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో బాధితులకు వైద్యం అందించడం నేరమని వైద్యాధికారులే చెబుతు న్నప్పటికీ కేసులు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే నిర్లక్ష్యం వహించడం వెనుక కారణాలేంటో అర్థం కావడం లేదని స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎంహెచ్వో తీవ్రంగా పరిగణించడంతో ప్రియాంక, భారతి క్లినిక్ లను పోలీసుల సమక్షంలో సీజ్ చేశారు. వెంటనే అనుమతి లేని క్లినిక్ లను తొలగించి, నకిలీ వైద్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డీఎంహెచ్ఓ రాజశ్రీ, జిల్లా వైద్యాధికారుల బృందం, ఆర్మూర్ డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్, సాయన్న, జిల్లా అధికారులు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Next Story