- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు గ్లోబల్ కంపెనీల క్యూ: టీఎంయూఎస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
విభిన్న రంగాలకు చెందిన నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున అనేక సంస్థలు తమ నూతన కేంద్రాల ఏర్పాటు, తదుపరి విస్తరణల కోసం హైదరాబాద్ వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: విభిన్న రంగాలకు చెందిన నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున అనేక సంస్థలు తమ నూతన కేంద్రాల ఏర్పాటు, తదుపరి విస్తరణల కోసం హైదరాబాద్ వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. గురువారం అమెరికా టెలికాం దిగ్గజం టీఎంయూఎస్ (టీ-మొబైల్ యూఎస్) గ్లోబల్ సొల్యూషన్స్ నూతన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌ను మంత్రి హైటెక్ సిటీలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ భారీ టెక్నాలజీ సెంటర్ వచ్చే ఏడాది చివరి నాటికి వెయ్యి మంది నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందన్నారు. ఇప్పటికే 450 జీసీసీ కేంద్రాలకు నెలవుగా మారిన హైదరాబాద్.. ఈ ఆధునిక కేంద్రంతో మరింత గుర్తింపును తెచ్చుకుందని చెప్పారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన ఎకో సిస్టం వల్ల సాంకేతికత, ఇంజినీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ గ్లోబల్ కంపెనీలను ఆకర్షిస్తున్నదని వివరించారు.
సెమీకండక్టర్స్, బ్యాంకింగ్/ఫైనాన్స్, రిటైల్, జీవ విజ్ఞానం (లైఫ్ సైన్సెస్), బ్యూటీ రంగాలకు సంబంధించిన జీసీసీ కేంద్రాలు ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. కాగా.. టీ-మొబైల్ యూఎస్ అమెరికాలోని అతిపెద్ద వైర్‌లెస్ నెట్‌వర్క్ ఆపరేటర్లలో ఒకటిగా ఉన్నది. 14 కోట్లకుపైగా వినియోగదారులకు సేవలు అందిస్తున్నది. ఈ కార్యక్రమంలో సంస్థ గ్లోబల్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ చంద్రగుప్త, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






