- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.

దిశ,తొగుట: మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మన్నె యాదగిరి భార్య మన్నె కళ (45) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెల వివాహాలు, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపానికి గురవుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వడ్లు ఎత్తేందుకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన కళ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గ్రామ శివారులోని నరెడ్ల రాజిరెడ్డి బావి వద్ద కళ చెప్పులు కనిపించడంతో అనుమానం వ్యక్తమైంది. బావిలో గాలింపు చేపట్టగా మధ్యాహ్నం సమయంలో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలి కుమారుడు మన్నె లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తోగుట ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.






