- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లూ కోల్ట్స్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు
బ్లూ కోల్ట్స్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాక దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి పై తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

దిశ,తిరుమలాయపాలెం: బ్లూ కోల్ట్స్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాక దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి పై తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని జల్లేపల్లి గ్రామానికి చెందిన కటుకూరి ఉషాకిరణ్ - రాణి భార్యాభర్తల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రాణి తన భర్త ఉషాకిరణ్ తాగి వచ్చి అనుమానంతో తీవ్రంగా కొట్టి హింసిస్తున్నారని, డయల్ 100కి కాల్ చేసి అర్జెంటుగా పోలీసులను పంపించాలని లేకుంటే తనను కొట్టి చంపేస్తాడని తెలిపింది. దీంతో రాత్రి 11 గంటల సమయంలో తిరుమలాయపాలెం బ్లూ కోల్ట్స్ పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఉషాకిరణ్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ.. దాడికి దిగి దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించినందుకు గురువారం ఉషా కిరణ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కూచిపూడి జగదీశ్ తెలిపారు.






