- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Toyota: కొత్త లుక్‌తో 2026 ఇన్నోవా క్రిస్టా
దీని ప్రారంభ ధర రూ.19.72 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా, అన్ని ఫీచర్లతో కూడిన టాప్-ఎండ్ ‘జెడ్ఎక్స్’ వేరియంట్ ధర రూ.26.63 లక్షల వరకు ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ కంపెనీ అత్యంత ప్రజాదరణ పొందిన తన ఎంపీవీ మోడల్ 'ఇన్నోవా క్రిస్టా' 2026ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.19.72 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా, అన్ని ఫీచర్లతో కూడిన టాప్-ఎండ్ ‘జెడ్ఎక్స్’ వేరియంట్ ధర రూ.26.63 లక్షల వరకు ఉంది. ఈ కొత్త వెర్షన్‌లో కారు బయటి డిజైన్ మరింత లగ్జరీగా మార్చారు. మూడు క్రోమ్ లైన్లతో కూడిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త డిజైన్ బంపర్లు, అక్కడక్కడా క్రోమ్ టచ్‌లతో ఇన్నోవా క్రిస్టా మునుపటి కంటే చాలా గ్రాండ్ లుక్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆటోమొబైల్ వర్గాల అంచనాల ప్రకారం.. 2027 నాటికి ఈ మోడల్ ఉత్పత్తిని టయోటా పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్నోవా క్రిస్టా సిరీస్‌లో ఇదే చివరి, ప్రత్యేకమైన మోడల్ కానుంది. కారు లోపలి భాగం (క్యాబిన్) విషయానికొస్తే.. సరికొత్త డ్యూయల్-టోన్ లెదర్ సీట్లు, రిఫ్రెష్ చేసిన విలాసవంతమైన డాష్‌బోర్డ్, వుడ్-ఫినిష్ డిజైన్, అప్‌డేట్ చేసిన ఏసీ కంట్రోల్స్ కారుకు లగ్జరీ ఫీల్‌ని ఇచ్చాయి. ఆధునిక కాలానికి తగ్గట్టుగా వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, టీపీఎంఎస్ వంటి సరికొత్త ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఎప్పటిలాగే పవర్‌ఫుల్ 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్, మాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే ఈ కారు వస్తుంది. వీటికి తోడు ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్-ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అత్యంత భద్రత కలిగిన ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చారు.






