ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

by Taduka Kalyani |

రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గురువారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిట్ ముందు ఆయన విచారణకు హాజరయ్యారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి
X

దిశ, మీర్ పేట్ : రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గురువారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిట్ ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. షిఫ్ట్ అధికారులు ఆయనను 45 నిమిషాలు పాటు విచారించారు. బుధవారం రాత్రి ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగల కృష్ణారెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సిట్ విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉందని 2014 నుంచి 2018 మధ్య కాలంలో ప్రస్తుత సీఎం రేవంత్, ఏఐసీసీ ఖర్గే లతో మాట్లాడిన సందర్భాలు సిట్ అధికారులు పై ప్రశ్నలు అడిగారనీ వారికి సమాధానం చెప్పానన్నారు.తన 52 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదని అన్ని పార్టీల నేతలతో రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని అధికారులు ఎప్పుడూ పిలిచినా తాను సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.

Next Story