- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారులను చట్టపరంగా కఠినంగా అణిచివేస్తాం
డ్రగ్స్, గంజాయి, తదితర మాదకద్రవ్యాల ఊబిలో నుంచి యువతను కాపాడేందుకు ఈగిల్ నిరంతరం కృషి చేస్తుంటుందని డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు.

దిశ,సిటీ క్రైమ్ : డ్రగ్స్, గంజాయి, తదితర మాదకద్రవ్యాల ఊబిలో నుంచి యువతను కాపాడేందుకు ఈగిల్ నిరంతరం కృషి చేస్తుంటుందని డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. డ్రగ్స్ మత్తుకు చిక్కిన యువత, విద్యార్ధులు, ఇతర వినియోగదారులతో పాటు వీటిని సరఫరా చేస్తున్న అక్రమార్కులను ఇప్పటి వరకు 800 మందిని గుర్తించామన్నారు. ప్రభుత్వం 36 రిహాబిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి మత్తు బారిన పడిన వారిని తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు సహాయం చేస్తుందన్నారు. మూడేండ్లుగా ఈగిల టోల్ ఫ్రీ నెంబరు 1908 కు ఇప్పటి వరకు వెయ్యి ఫోన్ కాల్స్ వచ్చాయని, ఆ కాల్స్ ద్వారా చాలా మంది మత్తు దందాకు సంబంధించిన కీలక సమాచారం అందించారన్నారు. వాటిపై దర్యాప్తు చేసి అనుకోకుండా ఈ మహమ్మారి అలవాటుకు చిక్కిన వారిని బయటపడేసేందుకు వారిని డి-అడిక్షన్ కేంద్రాలకు తరలిస్తుండగా, సరఫరాదారులను జైలుకు పంపుతున్నామన్నారు. దందా చేసే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ఈగిల్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ దందా చేసే ముఠాలను చట్టపరంగా అణిచివేస్తామని ఆయన హెచ్చరించారు. డి-అడిక్షన్ కేంద్రాలకు వెళ్ళిన యువత పై కూడా నిరంతరం నిఘా కొనసాగుతుందన్నారు. వారిని తరుచు డ్రగ్స్ కిట్ ల ద్వారా తనిఖీ చేసి తాజా పరిస్థితిని పరిశీలిస్తున్నామన్నారు. మత్తు దందాకు సంబంధించి సమాచారాన్ని అందిస్తున్న పౌరుల బాధ్యతను ఈగిల్ అధికారులు అభినందిస్తున్నారు. కాబట్టి పౌరుల వద్ద అక్రమ డ్రగ్స్, గంజాయి వ్యాపారం, ఈ మత్తుకు చిక్కిన యువత సమాచారం ఉంటే వెంటనే 1908 కు ఫోన్ చేయాలని సందీప్ శాండిల్య కోరారు. ఇప్పటి వరకు 187 మంది విద్యార్ధులను డి-అడిక్షన్ కేంద్రాలకు పంపించామని ఆయన వివరించారు.






