- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజన నిరుద్యోగ యువతకు శుభవార్త
ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన ఒక రోజు నైపుణ్యాభివృద్ధి అవగాహన, ప్రేరణ శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి బి. వెంకటేష్ తెలిపారు.

దిశ,సంగారెడ్డి అర్బన్: జిల్లాలోని ఎస్టీ నిరుద్యోగ యువతకు తీపి కబురు. ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన ఒక రోజు నైపుణ్యాభివృద్ధి అవగాహన, ప్రేరణ శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి బి. వెంకటేష్ తెలిపారు. ఉదయం 11 గంటలకు సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో జరిగే ఈ శిబిరంలో జిల్లా వ్యాప్తంగా 114 మంది ఎస్టీ నిరుద్యోగ యువతను ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. యువతలో ఆత్మవిశ్వాసం నింపడం, వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమన్నారు.నిపుణులతో కెరీర్ గైడెన్స్ ఈ కార్యక్రమంలో వివిధ నైపుణ్య శిక్షణ సంస్థల ప్రతినిధులు, మోటివేషనల్ కౌన్సిలర్లు పాల్గొని యువతకు కెరీర్ మార్గనిర్దేశం చేస్తారు. శిక్షణ అనంతరం లభించే ఉపాధి అవకాశాలు, ప్లేస్‌మెంట్, స్వయం ఉపాధి మార్గాలపై సమగ్ర సమాచారం అందిస్తారని డీటీడీవో వెంకటేష్ వివరించారు. ఈ శిబిరంలో అగ్రికల్చర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అగ్రికల్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బ్యూటీ అండ్ వెల్‌నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్, ఎన్‌ఐ-ఎంఎస్ఎంఈ వంటి ప్రముఖ శిక్షణ సంస్థలు పాల్గొని తమ కోర్సులను యువతకు పరిచయం చేస్తాయి.జిల్లా పరిధిలోని అర్హత కలిగిన ఎస్టీ నిరుద్యోగ యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని శిబిరంలో పాల్గొని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని డీటీడీవో కోరారు.






