గుడ్డేమ్ దొడ్డి రిజర్వాయర్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-04 13:54:42  IST  )

జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దరూర్ మండలం లోని నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పేస్ 1 లోని గుడ్డేమ్ దొడ్డి రిజర్వాయర్‌ను గురువారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, యువజనుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కర్ణాటక ఇరిగేషన్ మంత్రి బోస్ రాజ్ తో కలిసి పరిశీలించారు.

గుడ్డేమ్ దొడ్డి రిజర్వాయర్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, జోగులాంబ ప్రతినిధి : జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దరూర్ మండలం లోని నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పేస్ 1 లోని గుడ్డేమ్ దొడ్డి రిజర్వాయర్‌ను గురువారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, యువజనుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కర్ణాటక ఇరిగేషన్ మంత్రి బోస్ రాజ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఫేజ్-1లో ఉన్న గుడ్డేమ్ దొడ్డి మోటార్ల పని తీరును ముఖ్యమంత్రి పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి రూపొందించిన జోగులాంబ గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శనను సీఎం తిలకించారు.


గుడ్డేమ్ దొడ్డి రిజర్వాయర్ అభివృద్ధి, నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలపై అధికారులు చిత్ర ప్రదర్శన ద్వారా ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి,ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కి గుడ్డేమ్ దొడ్డి, ర్యాలంపాడు, ఘట్టు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా జిల్లాలో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మూడు రిజర్వాయర్ల కేపాసిటీ పెంపు కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.అంతేకాక గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీ లకు పెంచాలని, ర్యాలంపాడు రిజర్వాయర్ యొక్క నీటి సమకూర్చే ధారణిని అంతర్గతంగా అభివృద్ధి చేయాలనీ, ఇరిగేషన్ రోడ్లను అన్ని మండలాలకు అనుసంధానం చేయుటకు నిధులు ఇవ్వాలని, కాల్వ లైనింగ్‌కు నిధులు మంజూరు, గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ ఫేజ్–I మరియు ఫేజ్–II ద్వారా నీటిని సరఫరా చేసే స్కీమ్‌ను మెరుగుపరచుట.. అలాగే గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ ద్వారా ఇరిగేషన్ భూములకు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసి, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించుటకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, గొర్రెల, మేకల అభివృద్ధి సహకార కార్పొరేషన్ ఛైర్మన్ సరితా తిరుపతయ్య, వాల్మీకి ఫెడరేషన్ ఛైర్మన్ గట్టు తిమ్మప్ప, మాజీ ఎమ్మెల్యే సంపత్ ఇరిగేష‌న్ అధికారులు పాల్గొన్నారు.

Next Story