- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోహన్ లాల్ ‘అతిమనోహరం’ సినిమా షూటింగ్‌కు బ్రేక్.. పోస్ట్‌తో అసలు నిజాన్ని బయటపెట్టిన డైరెక్టర్
మా సినిమా షూటింగ్ స్క్రిప్ట్ సమస్యల వల్ల ఆగిపోయిందంటూ వస్తున్న ఆన్‌లైన్ వార్తలపై నాకు ఉదయం నుండి చాలా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ మోహన్ లాల్ వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తరుణ్ మూర్తి దర్శకత్వంలో ‘అతిమనోహరం’ చేస్తున్నారు. మోహన్‌లాల్ కెరీర్‌లో 366వ సినిమాగా రూపొందుతుండగా.. ఇందులో ఆయన ‘టి.ఎస్. లవ్ లజన్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన భార్యగా సీనియర్ నటి మీరా జాస్మిన్ నటిస్తోంది. రతీష్ రవి స్క్రిప్ట్ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆషిక్ ఉస్మాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా, స్క్రిప్ట్ విషయంలో తలెత్తిన కొన్ని గందరగోళాల కారణంగా ఈ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘అతిమనోహరం’ పై వస్తున్న పుకార్లను కొట్టిపారేస్తూ దర్శకుడు తరుణ్ మూర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
"మా సినిమా షూటింగ్ స్క్రిప్ట్ సమస్యల వల్ల ఆగిపోయిందంటూ వస్తున్న ఆన్‌లైన్ వార్తలపై నాకు ఉదయం నుండి చాలా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు, అవి పచ్చి అబద్ధాలు" అని తరుణ్ స్పష్టం చేశారు. సినిమా ప్రొడక్షన్ అప్‌డేట్ గురించి మాట్లాడుతూ.. "గడిచిన 78 రోజులుగా మా చిత్ర యూనిట్ అంతా తొడుపుజ పరిసర ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం అక్కడ కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం వల్ల మా ప్లానింగ్‌కు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న మాట నిజమే. కానీ, మా టీమ్ అంతా ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎంతో ఉత్సాహంతో, పాజిటివ్ ఎనర్జీతో పని చేస్తోంది. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, ఎంగేజ్‌మెంట్ కోసం ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దు. ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడే యూనిట్ సభ్యుల మనోభావాలను దెబ్బతీస్తాయి’’ అని రాసుకొచ్చారు. కాగా.. దర్శకుడు తరుణ్ మూర్తి, మోహన్‌లాల్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘తుడరుమ్’ భారీ విజయాన్ని సాధించింది. ఆ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘అతిమనోహరం’ పై భారీ అంచనాలు ఉన్నాయి.






