కాసేపట్లో జూబ్లీహిల్స్ బై పోల్ కౌంటింగ్.. హార్ట్ ఎటాక్‌తో అభ్యర్థి మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-14 02:27:32  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కాసేపట్లో జూబ్లీహిల్స్ బై పోల్ కౌంటింగ్.. హార్ట్ ఎటాక్‌తో అభ్యర్థి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) కాసేపటి క్రితం హార్ట్‌ ఎటాక్‌తో కన్నుమూశారు. అయితే, మరికొద్దిగంటల్లో ఫలితాలు వెలువడబోతుండగా అన్వర్ మృతి చెందడం కలకలం రేపుతోంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా, ఎన్నికల ఫలితాల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా కొనసాగేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ మేరకు కౌంటింగ్‌ ప్రక్రియను హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు

Read More..

Jubilee Hills Counting: దేవుడా నువ్వే కాపాడాలి... కౌంటింగ్ ముందు అభ్యర్థుల ప్రత్యేక పూజలు

Next Story