- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓట్ల కోసమే BC రిజర్వేషన్లపై కాంగ్రెస్ హైడ్రామా.. ఎంపీ రఘునందన్ రావు
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అఖిలపక్షంతో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)ని కలవాలనుకున్న అపాయింట్ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అఖిలపక్షంతో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)ని కలవాలనుకున్న అపాయింట్ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ (BJP) నేతలు అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే ప్రధానికి కలుస్తామని తెలిపారు. కానీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని, రేపటి బంద్ ఆ పార్టీకి వ్యతిరేకంగా జరగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ (Congress) పార్టీ బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. 42 శాతం బీసీ కోటాపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. నిజంగానే బీసీలపై ప్రేమే ఉంటే మొదలు కేబినెట్‌లో అమలు చేసిన చూపించాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన 10 మంది బీసీ బిడ్డలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేనే లేదన్నారు. జణగణన, కులగణన తర్వాతే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
Read More..
బీజేపీ బీసీ బంద్‌లో పాల్గొనడం ఏంటి.. కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్






