- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నది.. విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఖమ్మం సంజీవరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9వ షెడ్యూల్ ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని అడిగితే పట్టించుకోలేదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించిన కూడా నెలల తరబడి బిల్లు గురించి పట్టించుకోవడం లేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసిన కూడా కేంద్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ తీసుకొస్తుంటే బిజెపి కావాలని కాలయాపన చేస్తుందని అన్నారు. బీసీలకు బిజెపి వ్యతిరేకత అని ఆరోపించారు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీసీ రిజర్వేషన్ బిల్లుపై అభిప్రాయం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టే న్యాయస్థానాలు బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిందన్నారు. రేపు జరగబోయే బంద్ బిజెపి బిల్లు ఆపిందనే వ్యతిరేకంగానే బంద్ కార్యక్రమం ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో నాయకుడు తదితరులు పాల్గొన్నారు.
Read More..
బీజేపీ బీసీ బంద్‌లో పాల్గొనడం ఏంటి.. కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్






