- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ బీసీ బంద్‌లో పాల్గొనడం ఏంటి.. కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధానకు బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు ఏకమై ఎంపీ ఆర్.కృష్ణయ్య (R Krishnaiah) చైర్మన్‌గా జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)గా ఏర్పడింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధానకు బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు ఏకమై ఎంపీ ఆర్.కృష్ణయ్య (R Krishnaiah) చైర్మన్‌గా జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)గా ఏర్పడింది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అమలుకు విడుదల చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రేపు ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో బంద్ చేపట్టాలని నిర్ణయించారు. అయితే, బీసీ జేఏసీ చేపడుతున్న బంద్ మద్దతు ఇవ్వాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలను కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)కు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు.
ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లకు ఏమాత్రం అర్హత లేదని కామెంట్ చేశారు తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్‌లో పాల్గొనటం ఏంటని ప్రశ్నించారు. అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్లుగా భావించాలా అని అన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో బిల్లులు పాస్ చేసి కేంద్రంపై కొట్లాడకుండా ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తామే ముందుండి బంద్ చేయిస్తామంటోందని ఎద్దేవా చేశారు. రెండు జాతీయ పార్టీలు బీసీలను కలిసి వంచిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పెంపు కోసం ముందుండి పోరాడుతున్న తెలంగాణ జాగృతి రేపు బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌కు సంపూర్ణ మద్దతునిస్తుందని కల్వకుంట్ల కవిత అన్నారు.
Read More..






