- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్.. వైటల్స్ స్థిరంగా ఉన్నా, బ్లడ్ పారామీటర్స్‌లో మార్పులతో 24 గంటల నిఘా!

దిశ, వెబ్ డెస్క్: దేశంలో నీట్ పేపర్ లీక్ కు నిరసనగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు 21 రోజుల నుంచి ఆయన ఈ దీక్షను కొనసాగిస్తుండగా.. అతని ఆరోగ్యం పూర్తిగా విషమించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఉదయం సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి విక్రమ్ మోహన్ మెమోరియల్ మెడికల్ కాలేజ్ (VMMC), సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స అందించిన డాక్టర్లు ఆదివారం ఉదయం 8. 30 గంటలకు సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ (Wangchuk Health Bulletin) విడుదల చేశారు.
అందులో ప్రస్తుతం ఆయనకు లభిస్తున్న వైద్య సహాయంపై క్లారిటీ ఇస్తూ.. ఆయన వైటల్ పారామీటర్స్ (బిపి, పల్స్ రేటు) ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నట్లు వెల్లడించాయి. అయితే, దీర్ఘకాలిక నిరాహార దీక్ష ప్రభావం, శారీరక శ్రమ వల్ల ఆయన బ్లడ్ పారామీటర్స్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని వైద్యులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నివారించడానికి ఎయిమ్స్ (AIIMS), సఫ్దర్‌జంగ్ వైద్య నిపుణుల బృందం నిరంతరం నిఘా ఉంచిందని, 24 గంటల క్లినికల్ మానిటరింగ్ ద్వారా ఆయన రక్తం, ఇతర పరీక్షల నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆసుపత్రి యంత్రాంగం స్పష్టం చేసింది.






